అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ॥ 20
హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే ।
అథ, వ్యవస్థితాన్, దృష్ట్వా, ధార్తరాష్ట్రాన్, కపిధ్వజః,
ప్రవృత్తే, శస్త్రసంపాతే, ధనుః, ఉద్యమ్య, పాండవః.
హృషీకేశమ్, తదా, వాక్యమ్, ఇదమ్, ఆహ, మహీపతే,
మహీపతే = ఓ రాజా; అథ = అనంతరము; కపిధ్వజః = కపిధ్వజుడైన; పాండవః = అర్జునుడు; వ్యవస్థితాన్ = యుద్ధసంసిద్ధులైయున్న; ధార్తరాష్ట్రాన్ = దుర్యోధనాదులను; దృష్ట్వా = చూసి; శస్త్రసమ్పాతే = బాణప్రయోగసమయము; ప్రవృత్తే = రాగా; ధనుః = విల్లును; ఉద్యమ్య = లేవనెత్తి; తదా = అప్పుడు; హృషీకేశం = శ్రీకృష్ణునితో; ఇదం = ఈ; వాక్యమ్ = వాక్యమును; ఆహ = పలికాడు. (21– వ శ్లోక ప్రథమార్థం ఈ శ్లోకంతో అన్వయించబడింది)
తా ॥ ఓ మహీపతీ! అప్పుడు కపిధ్వజుడైన (ధ్వజంపై హనుమంతుని గుర్తు కలిగిన) అర్జునుడు యుద్ధసంసిద్ధులైన ధృతరాష్ట్ర పుత్రులను చూసి, విల్లునెత్తి శ్రీకృష్ణునితో ఇలా పలికాడు.