పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 15
పాంచజన్యమ్, హృషీకేశః, దేవదత్తమ్, ధనంజయః,
పౌండ్రమ్, దధ్మౌ, మహాశంఖమ్, భీమకర్మా, వృకోదరః.
హృషీకేశః = శ్రీకృష్ణుడు; పాంచజన్యమ్ = పాంచజన్యం అనే శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు; ధనంజయః = అర్జునుడు; దేవదత్తమ్ = దేవదత్తం అనే శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు; భీమకర్మా = భయాన్ని కలిగించే పనులు చేసే; వృకోదరః = భీముడు; మహాశంఖం పౌండ్రం = పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని; దధ్మౌ = పూరించాడు.
తా ॥ హృషీకేశుడు పాంచజన్యం అనే శంఖాన్ని, ధనంజయుడు దేవదత్తమనే శంఖాన్ని, ఎంతటి భయంకర కర్మలనైనా చేయగల భీముడు పౌండ్రమనే శంఖాన్ని పూరించారు.