తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ 13
తతః, శంఖాః, చ, భేర్యః, చ, పణవానక గోముఖాః,
సహసా, ఏవ, అభ్యహన్యంత, సః, శబ్దః, తుములః, అభవత్.
తతః = పిమ్మట; శంఖాః చ = శంఖాలు; భేర్యః చ = భేరులు; పణవ ఆనక గోముఖాః = డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు; సహసా ఏవ = ఒకేసారిగా; అభ్యహన్యంత = వాయింపబడ్డాయి; సః శబ్దః = ఆ ధ్వని; తుములః = సంకులము; అభవత్ = అయ్యెను.
తా ॥ (భీష్ముని యుద్ధోత్సాహం సర్వత్రా యుద్ధోత్సాహాన్ని పురికొల్పింది.) శంఖాలు, భేరులు, డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి. ఆ ధ్వనులు అన్నీ కలిసిపోయినవి.