అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ 9
అన్యే, చ, బహవః, శూరాః, మదర్థే, త్యక్తజీవితాః
నానాశస్త్ర ప్రహరణాః, సర్వే, యుద్ధవిశారదాః
అన్యే చ = తదితరులు; బహవః = పెక్కుమంది; శూరాః = వీరులు; మదర్థే = నా కొరకు; త్యక్తజీవితాః = ప్రాణత్యాగ సంసిద్ధులు; సర్వే = వీరందరూ; నానాశస్త్ర ప్రహరణాః = వివిధ శస్త్రాయుధులు; యుద్ధవిశారదాః = యుద్ధ నిపుణులు.
తా ॥ నా నిమిత్తం ప్రాణాన్ని సైతం త్యజించడానికి సంసిద్ధులైనవారు ఇంకా అనేకమంది ఉన్నారు. వీరందరూ వివిధశస్త్ర సంపన్నులు మరియు యుద్ధ నిపుణులు.