కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ॥ 44
కృషిగౌరక్ష్య వాణిజ్యమ్, వైశ్యకర్మ స్వభావజమ్,
పరిచర్య ఆత్మకమ్, కర్మ, శూద్రస్య, అపి, స్వభావజమ్.
కృషి గౌరక్ష్య వాణిజ్యమ్ = కృషి, గోరక్షణ, వాణిజ్యాలు; స్వభావజమ్ వైశ్య కర్మ = స్వాభావికాలైన వైశ్యకర్మలు; శూద్రస్య అపి = శూద్రునికి అనినచో; పరిచర్య ఆత్మకమ్ = సేవా రూపమైన; కర్మ = కర్మ; స్వభావజమ్ = స్వభావ సిద్ధం;
తా ॥ కృషి, గోరక్షణం, వాణిజ్యం వైశ్యస్వభావ సులభములైన కర్మలు; (త్రైవర్ణిక) సేవారూపమైన కర్మ శూద్రులకు స్వభావజాతమైనది.