తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ॥ 25
తత్, ఇతి, అనభిసంధాయ, ఫలమ్, యజ్ఞ తపః క్రియాః,
దానక్రియాః, చ, వివిధాః, క్రియంతే, మోక్షకాంక్షిభిః.
తత్ ఇతి = తత్ అనే బ్రహ్మ వాచక శబ్దాన్ని ఉచ్చరించి; ఫలమ్ = ఫలాన్ని; అనభిసంధాయ = ఆకాంక్షించకుండా; మోక్ష కాంక్షిభిః = ముముక్షువులచే; వివిధాః = నానా విధాలైన; యజ్ఞ తపః క్రియాః = యజ్ఞ తపః కర్మలూ; దాన క్రియాః చ = దానకర్మలూ; క్రియంతే = ఒనర్చబడుతున్నాయి.
తా ॥ (ద్వితీయనిర్దేశాన్ని స్తుతిస్తున్నాడు 🙂 ‘తత్’ అనే బ్రహ్మవాచకాన్ని ఉచ్చరించి ముముక్షువులు నిష్కాములై యజ్ఞ దాన తపః క్రియలను ఆచరిస్తున్నారు. (చిత్తశుద్ధిని ముముక్షుత్వాన్ని ప్రసాదించేదవడం చేత ‘తత్’ శబ్ద నిర్దేశం ప్రశస్తమైంది.)