ఆయుఃసత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్వికప్రియాః ॥ 8
ఆయుః, సత్త్వ బల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధనాః,
రస్యాః, స్నిగ్ధాః, స్థిరాః, హృద్యాః, ఆహారాః, సాత్త్విక ప్రియాః.
ఆయుః–సత్త్వ–బల–ఆరోగ్య –సుఖ–ప్రీతి–వివర్ధనాః =ఆయువును, ఉత్సాహాన్నీ, శక్తిని, ఆరోగ్యాన్నీ, చిత్తప్రసాదాన్నీ, సంతోషాన్నీ వృద్ధి చేసేవీ; రస్యాః = రసవంతాలూ; స్నిగ్ధాః = స్నిగ్ధములైనవి; స్థిరాః = చెడిపోనివీ; హృద్యాః = మనోహరమైనవీ అయిన; ఆహారాః = ఆహారాలు; సాత్త్వికప్రియాః = సాత్త్వికులకు ఇష్టం.
తా ॥ ఆయువును, ఉత్సాహాన్నీ, శక్తిని, ఆరోగ్యాన్నీ, చిత్తప్రసాదాన్నీ, సంతోషాన్నీ విశేషంగా వృద్ధి చేసేవీ; రసవంతాలూ, స్నిగ్ధమైనవీ, చెడనివీ, మనోహరమైనవీ అయిన భక్ష్యభోజ్యాలు సాత్త్వికులకు ఇష్టమైనవి.