ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః ।
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ॥ 17
ఆత్మసంభావితాః, స్తబ్ధాః, ధనమాన మదాన్వితాః,
యజంతే, నామయజ్ఞైః, తే, దంభేన, అవిధి పూర్వకమ్.
ఆత్మ సంభావితాః = ఆత్మశ్లాఘులై, తమ గొప్పతనాన్ని తామే చెప్పుకుంటూ; స్తబ్ధాః = వినయరహితులై; ధన మాన మదాన్వితాః = ధనం వల్ల కలిగే అభిమాన గర్వాలతో కూడినవారై; తే = వారు (ఆ ఆసుర పురుషులు) దంభేన = కపటంతో; నామయజ్ఞైః = పేరుకు మాత్రమే అయిన యజ్ఞాల చేత; అవిధి పూర్వకమ్ = విధిరహితంగా (శాస్త్రవిధిని ఉల్లంఘిస్తూ); యజంతే = యజ్ఞం చేస్తారు.
తా ॥ వారు ఆత్మశ్లాఘులై, ఐశ్వర్యమదగర్వంతో, దంభంతో శాస్త్రవిధిని ఉల్లంఘిస్తూ, పేరుకు మాత్రమే అయిన యజ్ఞాలను* ఒనర్చుతున్నారు.