చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః ।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ॥ 11
చింతామ్, అపరిమేయామ్, చ, ప్రలయ అంతామ్, ఉపాశ్రితాః,
కామ ఉపభోగ పరమాః, ఏతావత్, ఇతి, నిశ్చితాః.
ప్రలయ అంతామ్ = మృతిచెందే వరకు; అపరిమేయాం చ = పరిమితి లేని; చింతామ్ = చింతను; ఉపాశ్రితాః = ఆశ్రయించి; కామ ఉప భోగ పరమాః = కామభోగ పరాయణులై; ఏతావత్ = ఇదే పరమపురుషార్థం; ఇతి = అని; నిశ్చితాః = నిశ్చయించినవారు;
తా ॥ వారు మృతిచెందే వరకు ఎనలేని చింతలను పొందుతూ, కామ భోగమే పరమపురుషార్థం అనీ దానికి మించినదేమీ లేదనీ నమ్ముతారు.