అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ ।
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ ॥ 8
అసత్యమ్, అప్రతిష్ఠమ్, తే, జగత్, ఆహుః, అనీశ్వరమ్,
అపరస్పర సంభూతమ్, కిమ్, అన్యత్, కామహైతుకమ్.
తే = వారు; జగత్ = జగత్తు; అసత్యమ్ = వేదపురాణాది ప్రమాణ రహితం; అప్రతిష్ఠమ్ = ధర్మ-అధర్మ వ్యవస్థా రహితం; అనీశ్వరమ్ = కర్తృ రహితం; కామ హైతుకమ్ = కామం వల్ల కల్గింది; అపరస్పర సంభూతమ్ = స్త్రీ పురుష సంభూతం కానిది; కిం అన్యత్ = వేరే ఏది ఉండగలదు? అని; ఆహుః = పలికారు.
తా ॥ వారు ఈ జగత్తును, వేదపురాణాది ప్రమాణ శూన్యమనీ (అసత్యం), ధర్మాధర్మ వ్యవస్థా శూన్యమనీ (ప్రతిష్ఠా రహితం), కర్తయూ ఫలదాతయూ అయిన ఈశ్వరుడు లేడనీ (అనీశ్వరం), కామవశంతో స్త్రీ-పురుష సంయోగం వల్ల ఉత్పన్నమైనదనీ, మరి దీనికి ఇతర కారణాలేవీ లేవనీ చెబుతారు.