ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ॥ 6
ద్వౌ, భూతసర్గౌ, లోకే, అస్మిన్, దైవః, ఆసురః, ఏవ, చ,
దైవః, విస్తరశః, ప్రోక్తః, ఆసురమ్, పార్థ, మే, శృణు.
పార్థ = అర్జునా; అస్మిన్ = ఈ; లోకే = జగత్తులో; దైవః = దైవ స్వభావమూ; ఆసురః ఏవ చ = ఆసుర స్వభావమూ గల; ద్వౌ = రెండు విధాలైన; భూత సర్గౌ = మనుష్య సృష్టి (అయింది); దైవః = దైవ–సృష్టి; విస్తరశః = విస్తారంగా; ప్రోక్తః = చెప్పబడింది; ఆసురమ్ = ఆసుర సృష్టిని; మే = నా నుండి; శృణు = విను.
తా ॥ (ఆసుర సంపదను సర్వాత్మనా వర్జించాలి; కనుక అది వివరింప బడుతోంది 🙂 అర్జునా! ఈ జగత్తులో దైవస్వభావ సంపన్నులు, ఆసురస్వభావ యుక్తులు – అని రెండు విధాలుగా మనుష్యులు సృష్టింపబడి ఉన్నారు.* దైవీ స్వభావ సంపన్నుల విషయం విశదంగానే బోధించాను. ఇక, ఆసురస్వభావ యుక్తులైన వారి గురించి చెబుతాను, విను. (గీత : 9-12, 13; 7-15 చూ)