ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ ।
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ॥ 20
ఇతి, గుహ్యతమమ్, శాస్త్రమ్, ఇదమ్, ఉక్తమ్, మయా, అనఘ,
ఏతత్, బుద్ధ్వా, బుద్ధిమాన్, స్యాత్, కృతకృత్యః, చ, భారత.
అనఘ = పాపరహితా; ఇతి = ఇలా; ఇదమ్ = ఈ; గుహ్యతమమ్ = అత్యంత రహస్యమైన; శాస్త్రమ్ = శాస్త్రం; మయా = నా చేత; ఉక్తమ్ = చెప్పబడింది; భారత = అర్జునా; ఏతత్ = దీనిని; బుద్ధ్వా = తెలుసుకున్న; బుద్ధిమాన్ = జ్ఞాని; కృతకృత్యః చ = కృతార్థుడు; స్యాత్ = అవుతాడు;
తా ॥ అనఘా! నేను నీకు ఈ గుహ్యతమమైన శాస్త్రాన్ని బోధించాను; భారతా! ఈ తత్త్వాన్ని గ్రహించిన యోగి బుద్ధిమంతుడూ (జ్ఞాని), కృతకృత్యుడూ అవుతాడు.