న రూపమ స్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ॥ 3
న, రూపమ్, అస్య, ఇహ, తథా, ఉపలభ్యతే, న, అంతః, న, చ, ఆదిః, న, చ, సంప్రతిష్ఠా,
అశ్వత్థమ్, ఏనమ్, సువిరూఢమూలమ్, అసంగ శస్త్రేణ, దృఢేన, ఛిత్త్వా.
ఇహ = ఈ సంసారంలో; అస్య = దీని; రూపమ్ = స్వరూపం; తథా = చెప్పబడినట్లు; న ఉపలభ్యతే = గ్రహింపబడటం లేదు; (అస్య = దీని;) అంతః = తుది కాని; ఆదిః చ = మొదలు కాని; సంప్రతిష్ఠా చ = మధ్యం కాని, స్థితి కాని; (న ఉపలభ్యతే = తెలియడం లేదు;) ఏనమ్ = ఈ; సువిరూఢ మూలమ్ = పాతుకున్న మొదళ్ళు గల; అశ్వత్థమ్ = సంసారరూపమైన అశ్వత్థాన్ని; దృఢేన = దృఢమైన; అసంగ శస్త్రేణ = విరక్తి (అనాసక్తి) అనే శస్త్రంతో; ఛిత్త్వా = త్రుంచి.
తా ॥ ఇహలోకంలో (అంటే ఈ సంసారంలో ఉన్న) ప్రాణులు, ఈ సంసార రూపమైన అశ్వత్థపు స్వరూపాన్ని ఇంతకుముందు చెప్పిన రీతిగా తెలుసుకోజాలకున్నారు. (ఎందుకంటే, ఇది స్వప్నం వలే, మరీచిక వలే దృష్ట–నష్ట స్వరూపం) దీనికి ఆరంభం లేదు, అనాది. దీనికి (బ్రహ్మజ్ఞానం లేకుండా) అంతం లేదు. దీని స్థితిని గాని, ఇది ఇలా ఉంటుందని గాని తెలుసుకోలేం. ఇది ప్రామాణ్యం కాదు, ప్రతీతిమాత్రం.* బద్ధమూలమైన ఈ సంసార-అశ్వత్థాన్ని, ‘తీవ్రవైరాగ్యం’ అనే దృఢశస్త్రంతో* ఛేదించి* –