రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।
రజ స్సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ॥ 10
రజః, తమః, చ, అభిభూయ, సత్త్వమ్, భవతి, భారత,
రజః, సత్త్వమ్, తమః, చ, ఏవ, తమః, సత్త్వమ్, రజః, తథా.
భారత = అర్జునా; రజః = రజోగుణాన్ని; తమః = తమో గుణాన్ని; అభిభూయ = అణచి; సత్త్వమ్ = సత్త్వగుణం; భవతి = కలుగుతోంది; రజః = రజోగుణం; సత్త్వమ్ = సత్త్వగుణాన్ని; తమః ఏవ చ = తమోగుణాన్ని; తథా = అదేవిధంగా; తమః = తమోగుణం; సత్త్వమ్ = సత్త్వగుణాన్ని; రజః = రజోగుణాన్ని (అణచిపెట్టి, కలుగుతున్నాయి);
తా ॥ భారతా! సత్త్వగుణం రజస్తమములను ఆక్రమించి ప్రబలమవుతోంది; రజోగుణం సత్త్వ, తమములను తిరస్కరించి ప్రాధాన్యం పొందుతోంది; తమోగుణం సత్త్వ, రజములను పరాభవించి పైకి వస్తోంది.