సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥ 4
సర్వయోనిషు, కౌంతేయ, మూర్తయః, సంభవంతి, యాః,
తాసామ్, బ్రహ్మ, మహత్, యోనిః, అహమ్, బీజప్రదః, పితా.
కౌంతేయ = అర్జునా; సర్వయోనిషు = దేవ, పితృ, మనుష్య, పశు యోనులలో; యాః = ఏ; మూర్తయః = దేహాలు; సంభవంతి = కలుగుతున్నాయో; తాసామ్ = వాటికి; యోనిః = జనని (ఉపాదానకారణం); మహత్ బ్రహ్మ = త్రిగుణాత్మకమైన ప్రకృతి; అహమ్ = నేను; బీజప్రదః = బీజాన్ని ఒసెగే; పితా = జనకుణ్ణి, నిమిత్తకారణాన్ని.
తా ॥ (కేవలం సృష్ట్యారంభంలోనే నా ఆధీనాలైన ప్రకృతి పురుషుల నుండి ఇలా భూతోత్పత్తి అని తలచకు, సర్వదా ఇలాగే జరుగుతోంది) కౌంతేయా! దేవ, పితృ, మనుష్య, పశ్వాది యోనుల నుండి ఉత్పన్నమైన దేహాలన్నింటికీ ప్రకృతి జనని; బీజప్రదాతనైన నేను జనకుణ్ణి.