శ్రీభగవానువాచ :
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥ 52
సుదుర్దర్శమ్, ఇదమ్, రూపమ్, దృష్టవాన్, అసి, యత్, మమ,
దేవాః, అపి, అస్య, రూపస్య, నిత్యమ్, దర్శన కాంక్షిణః.
మమ = నా; ఇదమ్ = ఈ; సుదుర్దర్శమ్ = అత్యంత దుర్దర్శమైన; యత్ = ఏ; రూపమ్ = విశ్వరూపాన్ని; దృష్టవాన్ అసి = చూసావో; దేవాః అపి = దేవతలు కూడా; అస్య = ఈ; రూపస్య = విశ్వరూపాన్ని; నిత్యమ్ = సర్వదా; దర్శన-కాంక్షిణః = చూడగోరతారు.
తా ॥ శ్రీభగవానుడు పలికెను: నీవు చూసిన ఈ విశ్వరూపాన్ని చూడడం అత్యంత దుర్లభం; దేవతలు కూడా నిత్యం ఈ రూపాన్ని దర్శింప ఆకాంక్షిస్తారు.