అర్జున ఉవాచ :
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ।
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ॥ 51
దృష్ట్వా, ఇదమ్, మానుషమ్, రూపమ్, తవ, సౌమ్యమ్, జనార్దన,
ఇదానీమ్, అస్మి, సంవృత్తః, సచేతాః, ప్రకృతిమ్, గతః.
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; జనార్దన = శ్రీకృష్ణా; తవ = నీ; ఇదమ్ = ఈ; సౌమ్యమ్ = ప్రసన్నమగు; మానుషమ్ రూపమ్ = మనుష్య రూపాన్ని; దృష్ట్వా = చూసి; ఇదానీమ్ = ఇప్పుడు; (అహమ్ = నేను;) సచేతాః = ప్రసన్నచిత్తుడను; సంవృత్తః = అయ్యాను; ప్రకృతిమ్ = స్వభావాన్ని(స్వస్థతను); గతః అస్మి = పొందాను.
తా ॥ అర్జునుడు పలికెను: జనార్దనా! సౌమ్యమైన ఈ నీ మనుష్య రూపాన్ని గాంచి నా చిత్తం ప్రసన్నత పొందింది, స్వస్థుడనయ్యాను.