మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ ।
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ॥ 49
మా, తే, వ్యథా, మా, చ, విమూఢభావః, దృష్ట్వా, రూపమ్, ఘోరమ్, ఈదృక్, మమ, ఇదమ్,
వ్యపేతభీః, ప్రీతమనాః, పునః, త్వమ్, తత్, ఏవ, మే, రూపమ్, ఇదమ్, ప్రపశ్య.
ఈదృక్ = ఇట్టి; మమ = నా; ఘోరం = భయంకరమైన; ఇదమ్ = ఈ; రూపమ్ = విశ్వరూపాన్ని; దృష్ట్వా = చూసి; తే = నీకు; వ్యథా = భయం; మా = వలదు; విమూఢభావః చ = చిత్తవైకల్యం; మా = వలదు; వ్యపేతభీః = భయరహితుడవై; ప్రీతమనాః = సంతుష్టచిత్తుడవై; పునః = మళ్ళీ; త్వమ్ = నీవు; మే = నా; తత్ = ఆ; ఇదమ్ = ఈ; రూపం ఏవ = పూర్వరూపంలో; ప్రపశ్య = చూడు.
తా ॥ భయంకరమైన నా ఈ విశ్వరూపాన్ని గాంచి నీవు భయాన్ని, చిత్తవైకల్యాన్ని పొందవద్దు. భయాన్ని వీడి, ప్రసన్నచిత్తంతో (శంఖ, చక్ర, గదా, పద్మ ధరమైన) నా చతుర్భుజ రూపాన్ని ఇప్పుడు చూడు.