సంజయ ఉవాచ :
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ ।
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ॥ 35
ఏతత్, శ్రుత్వా, వచనమ్, కేశవస్య, కృత అంజలిః, వేపమానః, కిరీటీ,
నమస్కృత్వా, భూయః, ఏవ, ఆహ, కృష్ణమ్, సగద్గదమ్, భీత భీతః, ప్రణమ్య.
కేశవస్య = శ్రీకృష్ణుని; ఏతత్ = ఈ; వచనమ్ = పలుకులను; శ్రుత్వా = విని; వేపమానః = వణకుచున్న వాడై; కిరీటీ = అర్జునుడు; కృత అంజలిః = చేతులు జోడించి; కృష్ణమ్ = శ్రీకృష్ణునికి; నమస్కృత్వా = నమస్కరించి; భీతభీతః = చాలా భయపడుతూ; ప్రణమ్య = ప్రణమిల్లి; భూయః ఏవ = మళ్ళీ; సగద్గదమ్ = గద్గద స్వరంతో; ఆహ = పలికాడు;
తా ॥ సంజయుడు పలికెను: శ్రీకృష్ణుని ఈ పలుకులను విని కిరీటి* వణకుతూ, చేతులు జోడించి నమస్కరించాడు; ఎంతో భయపడుతూ మళ్ళీ ప్రణమిల్లి, బాష్పగద్గద కంఠుడై ఇలా పలికాడు.