ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోఽస్తు తే దేవవర ప్రసీద ।
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ॥ 31
ఆఖ్యాహి, మే, కః, భవాన్, ఉగ్రరూపః, నమః, అస్తు, తే, దేవవర, ప్రసీద,
విజ్ఞాతుమ్, ఇచ్ఛామి, భవంతమ్, ఆద్యమ్, న, హి, ప్రజానామి, తవ, ప్రవృత్తిమ్.
ఉగ్రరూపః = అతిక్రూరమైన ఆకారం గల; భవాన్ = నీవు; కః = ఎవరో; మే = నాకు; ఆఖ్యాహి = తెల్పుము; తే = నీకు; నమః అస్తు = నమస్కారం; దేవవర = దేవ శ్రేష్ఠా; ప్రసీద = ప్రసన్నుడవుకమ్ము; ఆద్యమ్ = ఆదిపురుషుడవైన; భవంతమ్ = నిన్ను; విజ్ఞాతుమ్ = తెలిసికొన; ఇచ్ఛామి = కోరుతున్నాను; హి = ఏమన తవ = నీ; ప్రవృత్తిమ్ = ప్రవర్తనను; న ప్రజానామి = తెలిసికోజాలకున్నాను.
తా ॥ ఉగ్రమూర్తివైన నీవెవరవో నాకు తెలియజేయి. నీకు నమస్కారం. దేవశ్రేష్ఠా! ప్రసన్నుడవు కమ్ము! ఆది పురుషుడవైన నిన్ను తెలుసుకో గోరుతున్నాను; నీ ప్రవృత్తి తెలియకున్నది.