యథా నదీనాం బహవోఽంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి ।
తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ॥ 28
యథా, నదీనామ్, బహవః, అంబువేగాః, సముద్రమ్, ఏవ, అభిముఖాః, ద్రవంతి,
తథా, తవ, అమీ, నరలోక వీరాః, విశంతి, వక్త్రాణి, అభివిజ్వలంతి.
యథా = ఏ విధంగా; నదీనామ్ = నదుల; బహవః = పెక్కులగు; అంబువేగాః = నీటిధారలు; సముద్రం అభిముఖాః ఏవ = సముద్రం వైపుకే; ద్రవంతి = ప్రవహిస్తున్నాయో; తథా = అదే విధంగా; అమీ = ఈ; నరలోక వీరాః = మనుష్యయోధులు; అభివిజ్వలంతి =సర్వత్రా ప్రకాశమానమైన; తవ = నీ; వక్త్రాణి = నోళ్ళలో; విశంతి = ప్రవేశిస్తున్నారు.
తా ॥ అనేక నదీ ప్రవాహాలు సముద్రాభిముఖములై ప్రవహించి సముద్రం లోనే ప్రవేశించే విధంగా, ఈ వీర పురుషులందరూ సర్వత్ర దీప్యమానములైన నీ ముఖ–వివరముల ప్రవేశిస్తున్నారు.