దంష్ట్రాకరాళాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని ।
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ॥ 25
దంష్ట్రా కరాళాని, చ, తే, ముఖాని, దృష్ట్వా, ఏవ, కాల అనల సన్నిభాని,
దిశః, న, జానే, న లభే, చ, శర్మ, ప్రసీద, దేవ ఈశ, జగత్ నివాస.
దేవ ఈశ = దేవ దేవా; జగత్ నివాస = జగదాశ్రయా; దంష్ట్రాకరాళాని = భయంకర కోఱలూ; కాల అనల సన్నిభాని చ = ప్రళయాగ్ని సదృశాలూ అయిన; తే = నీ; ముఖాని = వదనాలను; దృష్ట్వా ఏవ = చూడడం వల్లే; దిశః న జానే = దిక్కులను తెలియజాలకున్నాను (దిగ్భ్రమ కలుగుతోంది); శర్మ చ = సుఖం కూడా; న లభే = పొందజాలకున్నాను; ప్రసీద = ప్రసన్నుడవు కమ్ము.
తా ॥ దేవ దేవా! భయంకరమైన కోఱలతో ఒప్పుతున్నవీ, ప్రళయాగ్ని సదృశాలూ అయిన నీ వదనాలను చూడగానే నాకు దిగ్భ్రమ కలుగుతోంది, నా శాంతి తొలగింది; జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము.