నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో ॥ 24
నభః స్పృశమ్, దీప్తమ్, అనేక వర్ణమ్, వ్యాత్త ఆననమ్, దీప్తవిశాల నేత్రమ్,
దృష్ట్వా, హి, త్వామ్, ప్రవ్యథిత అంతరాత్మా, ధృతిమ్, న, విందామి, శమమ్, చ, విష్ణో.
విష్ణో = సర్వవ్యాపీ (కృష్ణా); నభః స్పృశమ్ = ఆకాశాన్ని అంటుతూ; దీప్తమ్ = తేజోమయమై; అనేక వర్ణమ్ = నానావర్ణ విశిష్టుడవై; వ్యాత్త ఆననమ్ = విస్ఫారవదనుడవై; దీప్త విశాల నేత్రమ్ = ఉజ్జ్వలమూ, విశాలమూ అయిన నేత్రాలతో ఒప్పారుతున్న; త్వామ్ = నిన్ను; దృష్ట్వా హి = చూచుటచే; ప్రవ్యథిత అంతరాత్మా = కలత పడిన మనస్సుతో (నేను); ధృతిమ్ = ధైర్యాన్ని; శమం చ = శాంతిని; న విందామి = పొందలేకున్నాను.
తా ॥ సర్వవ్యాప్తమూ, గగనస్పర్శియూ, తేజోమయమూ, నానావర్ణ యుక్తమూ, విస్ఫార వదనమూ, ఉజ్జ్వల విశాలనేత్రమూ అయిన నీ విశ్వరూపాన్ని గాంచి నా మనస్సు కలవరపడుతోంది; ధైర్యాన్ని, శాంతిని పొందజాలకున్నాను.