అమీ హి త్వాం సురసంఘా విశంతి
కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి ।
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥ 21
అమీ, హి, త్వామ్, సురసంఘాః, విశంతి, కేచిత్, భీతాః, ప్రాంజలయః, గృణంతి,
స్వస్తి, ఇతి, ఉక్త్వా, మహర్షి సిద్ధసంఘాః, స్తువంతి, త్వామ్, స్తుతిభిః, పుష్కలాభిః.
అమీ = ఈ (యుద్ధమొనర్చే); సురసంఘాః = మనుష్య శరీర ధారులైన వసువు మున్నగు దేవతలు; త్వాం హి = నీయందే; విశంతి = ప్రవేశిస్తున్నారు; కేచిత్ = కొందరు; భీతాః = భయాన్ని పొంది; ప్రాంజలయః = బద్ధాంజలులై; గృణంతి = స్తుతిస్తున్నారు; మహర్షి సిద్ధ సంఘాః = మహర్షులూ సిద్ధులూ; స్వస్తి = జగత్తుకు శుభమగుగాక ఇతి = అని; ఉక్త్వా = పలికి; పుష్కలాభిః = సంపూర్ణములైన; స్తుతిభిః = స్తోత్రాలతో; త్వామ్ = నిన్ను; స్తువంతి = పొగడుతున్నారు.
తా ॥ యుద్ధమొనర్చే ఈ మనుష్య శరీరధారులైన వసువు మొదలుగా గల దేవతలు నీయందు ప్రవేశిస్తున్నారు. కొందరు భీతి చెంది, చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులూ, సిద్ధులూ, ‘జగత్తునకు శుభమగు గాక!’ అని పలికి శ్రేష్ఠములైన స్తోత్రాలతో నిన్ను పొగుడుతున్నారు.