కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ॥ 17
కిరీటినమ్, గదినమ్, చక్రిణమ్, చ, తేజోరాశిమ్, సర్వతః, దీప్తిమంతమ్,
పశ్యామి, త్వామ్, దుర్నిరీక్ష్యమ్, సమంతాత్, దీప్త అనల అర్క ద్యుతిమ్, అప్రమేయమ్.
కిరీటినమ్ = కిరీటధరునిగా; గదినమ్ = గదాధారిగా; చక్రిణమ్ = చక్రహస్తునిగా; సర్వతః = సర్వత్ర; దీప్తిమంతమ్ = ప్రకాశించువానిగా; తేజోరాశిమ్ = ప్రభాపుంజంగా; దుర్నిరీక్ష్యమ్ = దుర్దర్శనీయునిగా; దీప్త అనల అర్క ద్యుతిమ్ = ఉజ్జ్వలులైన సూర్యాగ్నుల కాంతిని పోలిన కాంతి గలవానిగా; అప్రమేయమ్ = అపరిచ్ఛిన్నునిగా; త్వామ్ = నిన్ను; సమంతాత్ = అన్ని యెడల; పశ్యామి = చూస్తున్నాను.
తా ॥ కిరీటచక్రగదాధరుడమా, సర్వత్ర ప్రకాశమానుడమా, ప్రభాపుంజ స్వరూపుడమా, దుర్నిరీక్ష్యుడమా, ప్రదీప్తాగ్ని సూర్యప్రభాకలితుడమా, అప్రమేయ స్వరూపుడమా అయిన నిన్ను అన్ని చోట్ల చూస్తున్నాను.