తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ।
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ॥ 14
తతః, సః, విస్మయ ఆవిష్టః, హృష్ట రోమా, ధనంజయః,
ప్రణమ్య, శిరసా, దేవమ్, కృత అంజలిః, అభాషత.
తతః = అనంతరం; సః = ఆ; ధనంజయః = అర్జునుడు; విస్మయ ఆవిష్టః = ఆశ్చర్యాన్వితుడూ; హృష్టరోమా = పులకాంకితుడై; దేవమ్ = విశ్వరూపధారియైన భగవంతునికి; శిరసాప్రణమ్య = శిరస్సుతో ప్రణమిల్లి; కృత అంజలిః = కృతజ్ఞతతో నమస్కరిస్తూ; అభాషత = పలికెను.
తా ॥ అనంతరం అర్జునుడు ఆశ్చర్యాన్వితుడూ, పులకితాంగుడూ అయ్యాడు; మరియు నతమస్తకుడై విశ్వరూపధరుండైన భగవంతునికి ప్రణమిల్లి, పిదప చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడు.