పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ॥ 6
పశ్య, ఆదిత్యాన్, వసూన్, రుద్రాన్, అశ్వినౌ, మరుతః, తథా,
బహూని, అదృష్టపూర్వాణి, పశ్య, ఆశ్చర్యాణి, భారత.
భారత = అర్జునా; ఆదిత్యాన్ = ద్వాదశాదిత్యులను; వసూన్ = అష్టవసువులను; రుద్రాన్ = ఏకాదశరుద్రులను; అశ్వినౌ = అశ్వినీకుమార ద్వయాన్ని; మరుతః = మరుద్దేవతా గణాన్ని; తథా = మరియు; అదృష్ట పూర్వాణి = (నీవు గాని ఇతరులు గాని) ఇంతవరకూ చూడని; ఆశ్చర్యాణి = అద్భుతాలను; బహూని = పెక్కింటిని; పశ్య = చూడు.
తా ॥ భారతా! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీకుమార ద్వయాన్ని , మరుద్దేవతా సప్తకాన్ని చూడు. మరియు, నీవుగాని ఇతరులు గాని ఇంతవరకూ చూడని అద్భుతాలను (రూపాలను) పెక్కింటిని గాంచు!