భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ॥ 2
భవ అప్యయౌ, హి, భూతానామ్, శ్రుతౌ, విస్తరశః, మయా,
త్వత్తః, కమలపత్ర అక్ష, మాహాత్మ్యమ్, అపి, చ, అవ్యయమ్.
కమల పత్ర అక్ష = తామర రేకుల వంటి కన్నులు గల (శ్రీకృష్ణా); త్వత్తః = నీ నుండి; భూతానామ్ = భూతాల యొక్క; భవ అప్యయౌ = జనన మరణాలు రెండూ; మయా = నా వలన; విస్తరశః హి = విశదంగానే; శ్రుతౌ = వినబడినవి; (నీ) అవ్యయమ్ = అక్షయమైన; మాహాత్మ్యమ్ అపి చ = (సర్వాత్మకత్వ, నిర్లేపత్వాదికమైన) మహిమను కూడా (విన్నాను).
తా ॥ పద్మపత్రాక్షా! నీ నుండి విశదంగానే భూతాల ఉత్పత్తిప్రళయాలను,* (సర్వాత్మత్వ నిర్లేపత్వాది రూపమైన) అక్షయమైన నీ మాహాత్మ్యాన్ని కూడా విన్నాను.