ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ॥ 27
ఉచ్చైఃశ్రవసమ్, అశ్వానాం, విద్ధి, మామ్, అమృత ఉద్భవమ్,
ఐరావతమ్, గజ ఇంద్రాణామ్, నరాణామ్, చ, నర అధిపమ్.
అశ్వానాం = గుఱ్ఱాలలో; అమృత ఉద్భవమ్ = అమృతం నుండి పుట్టిన; ఉచ్చైః శ్రవసమ్ = ఉచ్చైఃశ్రవసమును; గజ ఇంద్రాణామ్ = శ్రేష్ఠమైన ఏనుగులలో; ఐరావతమ్ = ఐరావతమును; నరాణాం చ = మనుష్యులలో; నర అధిపమ్ = రాజును; మాం = నన్ను; విద్ధి = ఎరుగుము.
తా ॥ నన్ను అశ్వాలలో (అమృతార్థం సముద్ర మంథనం ఒనర్చినప్పుడు ఉద్భవించిన) ఉచ్చైఃశ్రవంగా, శ్రేష్ఠమైన ఏనుగులలో ఐరావతంగా, మనుష్యులలో రాజుగా* తెలుసుకో.