వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ॥ 16
వక్తుమ్, అర్హసి, అశేషేణ, దివ్యాః, హి, ఆత్మ విభూతయః,
యాభిః, విభూతిభిః, లోకాన్, ఇమాన్, త్వమ్, వ్యాప్య, తిష్ఠసి.
యాభిః = ఏయే; విభూతిభిః = విభూతుల చేత; త్వమ్ = నీవు; ఇమాన్ = ఈ; లోకాన్ = లోకాలను; వ్యాప్య = వ్యాపించి; తిష్ఠసి = ఉన్నావో; దివ్యాః = అప్రాకృతాలైన; ఆత్మ విభూతయః = నీ విభూతులను; అశేషేణ హి = సంపూర్ణంగా; వక్తుమ్ = వ్యక్తపరచ (నీవే); అర్హసి = అర్హుడవు
తా ॥ (నీ ఆవిర్భావాన్ని దేవాదులు కూడా ఎరుగరు కనుక,) నీవు ఏయే విభూతుల చేత ఈ లోకాలంతటా వ్యాపించి ఉన్నావో ఆయా దివ్యములైన ఆత్మ విభూతులను సంపూర్ణంగా వర్ణింప నీవే సమర్థుడవు.