తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ॥ 19
తపామి, అహమ్, అహమ్, వర్షమ్, నిగృహ్ణామి, ఉత్సృజామి, చ,
అమృతమ్, చ, ఏవ, మృత్యుః, చ, సత్, అసత్, చ, అహమ్, అర్జున.
అర్జున = అర్జునా; అహమ్ = నేను; తపామి = వేడినొసగుతున్నాను; అహమ్ = నేను; వర్షమ్ = వానను; నిగృహ్ణామి = బిగబట్టుతున్నాను; ఉత్సృజామి చ = విడుస్తున్నాను; అమృతమ్ చ ఏవ = దేవతల అమృతాన్ని; మృత్యుః చ = మర్త్యుల మృత్యువును కూడా; (నేనే) అహమ్ = నేను; సత్ = స్థూలం, దృశ్యాన్ని; అసత్ చ = సూక్ష్మం, అదృశ్యాన్ని కూడా; (అయి ఉన్నాను).
తా ॥ సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను; జలాన్ని ఆకర్షిస్తూ వర్షిస్తున్నాను. అమరుల అమృతాన్ని మర్త్యుల మృత్యువును స్థూలసూక్ష్మములైన వస్తువులు కూడా నేనే.