శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ॥ 11
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ॥ 12
శుచౌ, దేశే, ప్రతిష్ఠాప్య, స్థిరమ్, ఆసనమ్, ఆత్మనః,
న, అతి ఉచ్ఛ్రితమ్, న, అతినీచమ్, చైల అజిన కుశ ఉత్తరమ్.
తత్ర, ఏకాగ్రమ్, మనః, కృత్వా, యతచిత్త ఇంద్రియక్రియః,
ఉపవిశ్య, ఆసనే, యుంజ్యాత్, యోగమ్, ఆత్మ విశుద్ధయే.
శుచౌ = శుద్ధమైన; దేశే = స్థానంలో; స్థిరమ్ = నిశ్చలమైనదీ; న అతి ఉచ్ఛ్రితమ్ = మిక్కిలి ఎత్తుకానిదీ; న అతి నీచమ్ = మిక్కిలి క్రిందు కానిదీ; చేల అజిన కుశ ఉత్తరమ్ = వస్త్ర, చర్మ, దర్భలతో ఏర్పరిచినదీ అయిన; ఆసనమ్ = ఆసనాన్ని; ఆత్మనః = తన కొరకు; ప్రతిష్ఠాప్య = స్థాపించి; తత్ర ఆసనే = ఆ ఆసనం పై; ఉపవిశ్య = కూర్చొని; యత చిత్త ఇంద్రియ క్రియః = అంతరింద్రియ, బహిరింద్రియ కార్యాలను నిరోధించినవాడు; మనః = మనస్సును; ఏకాగ్రమ్ కృత్వా = ఏకాగ్రమొనర్చి; ఆత్మవిశుద్ధయే = చిత్తశుద్ధి కొరకు; యోగమ్ = యోగాన్ని; యుంజ్యాత్ = అభ్యసించాలి.
తా ॥ పవిత్రస్థానంలో అంతగా ఉన్నతమూ నిమ్నమూ కాకుండా కుశాజిన చేలావృతమైన స్థిరాసనంలో ఆసీనుడై బాహ్యేంద్రియ కార్యాలను, అంతరింద్రియ కార్యాలను నిరోధించి, ఏకాగ్ర మనస్కుడై చిత్తశుద్ధి కొరకు యోగాన్ని అభ్యసించాలి.