కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ॥ 11
కాయేన, మనసా, బుద్ధ్యా, కేవలైః, ఇంద్రియైః, అపి
యోగినః, కర్మ, కుర్వంతి, సంగమ్, త్యక్త్వా, ఆత్మ శుద్ధయే.
యోగినః = నిష్కామ కర్మయోగులు; సంగమ్ = ఆసక్తిని; త్యక్త్వా = వీడి; ఆత్మశుద్ధయే = చిత్తశుద్ధికొరకు; కేవలైః = కేవలము; కాయేన = శరీరం చేత; మనసా = మనస్సు చేతా; బుద్ధ్యా = బుద్ధిచేతా; ఇంద్రియైః అపి = ఇంద్రియాల చేత; కర్మ = కర్మను; కుర్వంతి = చేయుచున్నారు.
తా ॥ (కర్మ ఇలా ఒనర్చే ఆచారం పూర్వులలో కలదని సదాచారం ప్రదర్శించబడుతోంది:) నిష్కామ కర్మయోగులు ఆసక్తిని త్యజించి, మమత్వాభిమాన శూన్యులై స్నానాదుల ద్వారా శరీరంతోనూ, ధ్యానాదుల ద్వారా మనుస్సుతోనూ తత్త్వనిశ్చయం ద్వారా బుద్ధితోనూ – ఇంద్రియాల సాయంతో (శ్రవణ కీర్తనాదులైన) కర్మలను ఆచరిస్తున్నారు.