అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః ।
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ॥ 36
అవాచ్యవాదాన్, చ, బహూన్, వదిష్యంతి, తవ, అహితాః,
నిందంతః, తవ, సామర్థ్యమ్, తతః, దుఃఖతరమ్, ను, కిమ్.
తవ చ = మరియు, నీ; అహితాః = శత్రువులు; తవ = నీ; సామర్థ్యమ్ = శక్తిని; నిందంతః = నిందిస్తూ; బహూన్ = పెక్కు; అవాచ్యవాదాన్ = అనరాని మాటలను; వదిష్యంతి = పలుకుతారు; తతః = దాని కంటే; దుఃఖతరమ్ = ఎక్కువ దుఃఖం; కిమ్ ను = ఇంకేం ఉంటుంది?
తా ॥ అంతేకాక నీ శత్రువులు కూడా నీ సామర్థ్యాన్ని నిందిస్తూ, ఎన్నో అనరాని మాటలను అంటారు; దీని కంటే దుఃఖకరమైంది ఇంకేం ఉంటుంది?