న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ॥ 8
న, హి, ప్రపశ్యామి, మమ, అపనుద్యాత్,
యత్, శోకమ్, ఉచ్ఛోషణమ్, ఇంద్రియాణామ్,
అవాప్య, భూమౌ, అసపత్నమ్, ఋద్ధమ్,
రాజ్యమ్, సురాణామ్, అపి, చ, ఆధిపత్యమ్.
భూమౌ = పృథ్విపై; అసపత్నమ్ = శత్రుశూన్యాన్ని; ఋద్ధమ్ = సమృద్ధమైన; రాజ్యమ్ = రాజ్యాన్ని; సురాణామపి ఆధిపత్యం చ =దేవతలపై అధికారం, స్వర్గరాజ్యాన్ని; అవాప్య = పొందినా; యత్ = ఏది; మమ = నా; ఇంద్రియాణామ్ = ఇంద్రియాల; ఉత్ శోషణమ్ = ఎండించివేస్తున్న; శోకమ్ = శోకాన్ని; అపనుద్యాత్ = నివారించగలదో; న హి ప్రపశ్యామి = కనుగొనలేకున్నాను. తా ॥ (నన్నే ఆలోచించి ఒనర్చమంటావా-) శత్రువిహీనమైన, సమృద్ధమైన భూలోకరాజ్యాన్నే కాదు స్వర్గాధిపత్యాన్ని పొందినా కూడా, ఇంద్రియ సంతాప కరమైన ఈ శోకాన్ని నివారించే ఉపాయాన్ని కనుగొనలేకున్నాను.