అర్జున ఉవాచ :
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ॥ 4
కథమ్, భీష్మమ్, అహమ్, సంఖ్యే, ద్రోణమ్, చ, మధుసూదన,
ఇషుభిః, ప్రతియోత్స్యామి, పూజార్హౌ, అరిసూదన
అరిసూదన = శత్రుమర్దనా; మధుసూదన = శ్రీకృష్ణా; అహం = నేను; సంఖ్యే = యుద్ధంలో; పూజార్హౌ = పూజ్యులైన; భీష్మమ్ = భీష్ముణ్ణి; చ = మరియు; ద్రోణమ్ = ద్రోణుణ్ణి; ప్రతి = ఎదిరించి; ఇషుభిః = బాణాలతో; కథమ్ = ఏ విధంగా; యోత్స్యామి = యుద్ధం చేస్తాను?
తా ॥ అర్జునుడు పలికెను: శత్రుమర్దనా! మధుసూదనా! (భయపడి యుద్ధం చేయనని నేను అనడం లేదు. ఇది అధర్మం, అన్యాయం) భీష్మద్రోణాదులు పూజ్యులు. (వాగ్యుద్ధమే తగని వారి పట్ల) వారిపై బాణాలను ఎలా వేస్తాను?