అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్ మధుసూదన ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ॥ 2
అధియజ్ఞః, కథమ్, కః, అత్ర, దేహే, అస్మిన్, మధుసూదన,
ప్రయాణకాలే, చ, కథమ్, జ్ఞేయః, అసి, నియత ఆత్మభిః.
మధుసూదన = కృష్ణా; అస్మిన్ = ఈ; దేహే = శరీరంలో; అధియజ్ఞః కః = అధిష్ఠాతయై వెలయువా డెవరు; అత్ర = ఈ శరీరంలో; కథమ్ = ఎట్లు; (స్థితః = వెలయుచున్నాడు) ప్రయాణకాలే చ = మరియు, మృత్యుసమయంలో; నియత ఆత్మభిః = సంయతచిత్తులచేత; కథమ్ = ఎట్లు; (నీవు) జ్ఞేయః అసి = తెలియదగిన వాడవవుతావు?
తా ॥ మధుసూదనా! (సమస్త కర్మకూ ఆధారమైన) ఈ శరీరాన్ని అధిష్ఠించి, నియమిస్తూ ఫలాలను ఒసగేదెవరు? అతడు ఏ విధంగా ఇందులో వెలయుచున్నాడు? అంతిమ సమయంలో నియతచిత్తులు ఏ ఉపాయంతో నిన్ను ఎరుగ గలుగుతున్నారు? (మూడుప్రశ్నలు)