తేజః క్షమా ధృతిశ్శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత ॥ 3
తేజః, క్షమా, ధృతిః, శౌచమ్, అద్రోహః, న, అతిమానితా,
భవంతి, సంపదమ్, దైవీమ్, అభిజాతస్య, భారత.
తేజః = ప్రతిభ; క్షమా = పరాభవం కలిగినా కోపం రాకుండటం; ధృతిః = దుఃఖాలలో (అవసాదాన్ని పొందకుండా) ధైర్యాన్ని వహించడం; శౌచమ్ = బాహ్యాభ్యంతర శుద్ధి; అద్రోహః = వైరభావం లేకుండటం; న అతిమానితా = అత్యంత పూజనీయుడ ననే భావం లేకుండటం; (అనేవి) భారత = అర్జునా; దైవీమ్ = దేవతాయోగ్యమైన (సాత్త్వికమైన); సంపదమ్ = స్థితికి; అభిజాతస్య = అర్హుడై పుట్టినవానికి; భవంతి = కలుగుతున్నాయి.
తా ॥ ప్రతిభ, పరాభవం కలిగినా కోపం రాకుండటం, దుఃఖాలలో (అవసాదాన్ని పొందక) ధైర్యాన్ని వహించడం, బాహ్యాభ్యంతర శుద్ధి, వైరభావం లేకుండటం, ఎక్కువగా పూజింపదగిన వాడననే భావం లేకుండటం అనే గుణాలు* భారతా! దేవతాయోగ్యమైన సాత్త్విక స్థితిని పొందే యోగ్యతతో జన్మించిన వారికి కలుగుతున్నాయి.