అనేకచిత్తవిభ్రాంతా మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ॥ 16
అనేక చిత్త విభ్రాంతాః, మోహజాల సమావృతాః,
ప్రసక్తాః, కామభోగేషు, పతంతి, నరకే, అశుచౌ.
అనేక చిత్త విభ్రాంతాః = పెక్కుసంకల్పాల చేత విక్షిప్తచిత్తం గలవారై; మోహ జాల సమావృతాః = మోహజాలం చేత ఆవృతులై; కామ భోగేషు = విషయభోగాలలో; ప్రసక్తాః = ఆసక్తులై; అశుచౌ = మలినమైన; నరకే = నరకంలో; పతంతి = పడుతున్నారు.
తా ॥ పెక్కు సంకల్పాలతో చిత్తం విక్షిప్తం చెంది, మోహజాలంలో తగుల్కొని, విషయ భోగాలయందు ఆసక్తులై అపవిత్రమైన నరకాలలో పడుతున్నారు.