తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ॥ 4
తతః, పదమ్; తత్, పరిమార్గితవ్యమ్, యస్మిన్, గతాః, న, నివర్తంతి, భూయః,
తమ్, ఏవ, చ, ఆద్యమ్, పురుషమ్, ప్రపద్యే, యతః, ప్రవృత్తిః, ప్రసృతా, పురాణీ.
తతః = పిదప; యస్మిన్ = ఎక్కడకు; గతాః = చేరుకుంటే; భూయః = మళ్ళీ; న నివర్తంతి = తిరిగి రారో; తత్పదమ్ = ఆ బ్రహ్మపదం; పరిమార్గితవ్యమ్ = అన్వేషింప తగింది; యతః = ఎవరి నుండి, (ఏషా =ఈ;) పురాణీ = అనాదియైన; ప్రవృత్తిః = సంసారప్రవాహం; ప్రసృతా = వెలువడిందో; తమ్ = ఆ; ఆద్యమ్ = ఆద్యుడైన; పురుషం ఏవచ = పరమ పురుషుణ్ణే; ప్రపద్యే = ఆశ్రయిస్తున్నాను.
తా ॥ పిదప, దేనిని పొందితే మళ్ళీ ఈ సంసారానికి తిరిగి రావడమనేది లేదో, ఆ పరమపదాన్ని అన్వేషించాలి. ఎవరి నుండి అనాదియైన ఈ సంసార ప్రవాహం నిర్గతమైనదో, నేను, ఆ ఆది పురుషుణ్ణి శరణు* జొచ్చుతున్నాను.