ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ॥ 15
ఆఢ్యః, అభిజనవాన్, అస్మి, కః, అన్యః, అస్తి, సదృశః, మయా,
యక్ష్యే, దాస్యామి, మోదిష్యే, ఇతి, అజ్ఞాన విమోహితాః.
ఆఢ్యః = ధనవంతుణ్ణి; అభిజనవాన్ = కులీనుణ్ణి; అస్మి = అయి ఉన్నాను; మయా సదృశః = నాతో సముడైన; అన్యః = ఇతరుడు; కః = ఎవడు; అస్తి = కలడు?; యక్ష్యే = యజ్ఞాన్ని చేస్తాను; దాస్యామి = దానాన్ని ఇస్తాను; మోదిష్యే = ఆనందిస్తాను; ఇతి = ఈ రీతిగా; అజ్ఞానవిమోహితాః = అవివేక ముగ్ధులై;
తా ॥ వారు అసంఖ్యాలైన ఆశాపాశాలలో బద్ధులై, ‘నేను ధనవంతుణ్ణి, సత్కుల జాతుడను, నాకు సముడెవ్వడు? యజ్ఞం చేస్తాను, దానం ఇస్తాను, ఆనందిస్తాను,’ అని అవివేకమోహితులై