అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ॥ 14
అసౌ, మయా, హతః, శత్రుః, హనిష్యే, చ, అపరాన్, అపి,
ఈశ్వరః, అహమ్, అహమ్, భోగీ, సిద్ధః, అహమ్, బలవాన్, సుఖీ.
అసౌ = ఈ; శత్రుః = విరోధి; మయా = నాచే; హతః = చంపబడ్డాడు; అపరాన్ అపి చ = మిగిలినవారిని కూడా; హనిష్యే = చంపుతాను; అహమ్ = నేను; ఈశ్వరః = శక్తిమంతుణ్ణి; అహమ్ = నేను; భోగీ = భోగిని; అహమ్ = నేను; సిద్ధః = పురుషార్థ సంపన్నుణ్ణి; బలవాన్ = బలవంతుణ్ణి; సుఖీ = సుఖవంతుణ్ణి.
తా ॥ ‘ఈ శత్రువును చంపాను, మిగిలిన వారిని కూడా చంపుతాను, నేను ప్రభువును, భోగిని, పురుషార్థసంపన్నుణ్ణి. బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి’ అని భావిస్తూ…