అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునమ్ ।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ॥ 2
అహింసా, సత్యమ్, అక్రోధః, త్యాగః, శాంతిః, అపైశునమ్,
దయా, భూతేషు, అలోలుప్త్వమ్, మార్దవమ్, హ్రీః, అచాపలమ్.
అహింసా = ప్రాణులను పీడింపకుండటం; సత్యమ్ = అప్రియాన్ని, అనృతాన్ని విడిచి నిజమైన దాన్ని చెప్పడం; అక్రోధః = వివిధ కారణాల వల్ల కలిగే కోపాన్ని అణచుకోవడం; త్యాగః = సన్న్యాసం; శాంతిః = చిత్తోపరతి; అపైశునమ్ = ఇతరుల దోషాలను వెల్లడి చేయకుండటం; భూతేషు దయా = ప్రాణుల యెడ దయ; అలోలుప్త్వమ్ = విషయాలు ఎదుటే ఉన్నా చలింపకుండటం; మార్దవమ్ = మృదుత్వం (అక్రౌర్యం); హ్రీః = కుకార్యాలు, కుచింతాల పట్ల సిగ్గు; అచాపలమ్ = వ్యర్థకార్యాలను ఒనర్చకపోవడం;
తా ॥ ప్రాణులను పీడింపకుండటం, అప్రియమూ అనృతమూ విడచి నిజమైన దానిని వచించడం, వివిధ కారణాల వల్ల కలిగే కోపాన్ని అణచుకోవడం, సన్న్యాసం, చిత్తోపరతి, ఇతరుల దోషాలను వెల్లడిచేయకపోవడం, ప్రాణులయెడ దయ, విషయాలు ఎదుటే ఉన్నప్పటికీ చలించకుండడం, మృదుత్వం, కుకార్యాలు కుచింతల పట్ల సిగ్గు, వ్యర్థకార్యాలను ఒనర్చకపోవడం–