మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ 25
మాన అపమానయోః, తుల్యః, తుల్యః, మిత్ర, అరి పక్షయోః,
సర్వ ఆరంభ పరిత్యాగీ, గుణ అతీతః, సః, ఉచ్యతే.
(యః = ఎవడు;) మాన అపమానయోః = సమ్మాన తిరస్కారాలలో; తుల్యః = సముడో; మిత్ర అరి పక్షయోః = మిత్ర శత్రుల పక్షాలలో; తుల్యః = సమబుద్ధియో; సర్వ ఆరంభ పరిత్యాగీ = పుణ్యపాపాలను ఒసగే సర్వకర్మలను త్యజించాడో; సః = అతడు; గుణ అతీతః = గుణాతీతుడని; ఉచ్యతే = చెప్పబడును.
తా ॥ మానావమానాల యెడను, శత్రుమిత్రుల యెడను సమబుద్ధితో ఉండేవాడూ; దృష్టాదృష్ట ఫలదాయకాలైన కర్మలను అన్నింటిని త్యజించినవాడూ, (కేవలం దేహధారణ నిమిత్తం ప్రయోజనమైన కర్మలను ఆచరించేవాడూ) అయిన పురుషుడు త్రిగుణాతీతుడని చెప్పబడును.